ప్రియాంకా గౌన్‌పై ట్విట్ట‌ర్‌లో పేలిన జోకులు

0priyanka-chopras-gown-in-twదేశీ గ‌ర్ల్ ప్రియాంకా చోప్రా వెరైటీ గౌన్‌తో మెట్ గాలా రెడ్ కార్పెట్‌ను ఓ ఊపు ఊపేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యాషనిస్ట్‌లు ఆమె గౌన్‌కు థ‌మ్సప్ చెప్పారు. కానీ ట్విట్ట‌ర్‌లో మాత్రం ఆమె గౌన్‌పై జోకులు పేలుతున్నాయి. స్వ‌చ్ఛ‌భార‌త్ ప్ర‌చారాన్ని ప్రియాంక చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుంది అని ఒక‌రంటే.. ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు వ‌ర్షం ప‌డినా బాధ‌ప‌డాల్సిన ప‌నిలేదు. ప్రియాంకా ఒక్క‌తే గ్రౌండ్ మొత్తాన్ని కవ‌ర్ చేస్తుంద‌ని మ‌రొక‌రు ఫ‌న్నీ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు. ఆమె వేసుకున్న గౌన్ అంత పెద్ద‌గా ఉంది మ‌రి. ఈ గౌన్ వేసుకొని రావ‌డానికి ప్రియాంకా కూడా చాలానే క‌ష్ట‌ప‌డింది. అంత‌టి గౌన్‌ను ఒంటిపై మోసుకురావ‌డానికి ఇబ్బంది ప‌డింది. ఓ ప్ర‌త్యేక వాహ‌నంలో రావాల్సి వ‌చ్చింది. అంతేకాదు మెట్లు ఎక్క‌డానికి కూడా మ‌రొక‌రు సాయం చేయాల్సి వ‌చ్చింది. ఇది చూసిన నెటిజ‌న్లు ఫ‌న్నీ ట్వీట్ల‌తో పండ‌గ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ప్రియాంకా గౌనే ట్రెండింగ్ అవుతున్నది.