సంజూ ఏంటో నాకు తెలుసు?

0ఈ ప్రపంచంలో ఏ మనిషిలో అయినా మంచి చేడు రెండు ఉంటాయి. అందులో కొన్ని పొరపాట్లు అలాగే తప్పులు కూడా ఉంటాయి. ఏ విషయం అయినా కూడా ఒకానొక సమయంలో బ్యాడ్ గా అయితే ఆ తరువాత దాని స్వరూపం మారుతుంది. తప్పు జరిగితే పొరపాటు అనడం అందరికి అలవాటే.. ఇకపోతే కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు సంజయ్ కు తన భర్త చేసినవన్ని పొరపట్లే అనే విధంగా మాట్లాడుతోంది.

ఉగ్రవాదులతో మాఫియాతో సంబంధాలు.. అలాగే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు. డ్రగ్ అడిక్ట్ అని సంజయ్ మీద గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ అండ అఫైర్స్ గురించి అయితే సంజయ్ ఒప్పుకున్నాడు. మిగతా వాటి గురించి మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇక భార్య మాన్యతా దత్ అయితే తన భర్త పొరపాట్లు చేశాడని అయినా తను చేసిన తప్పులకు చేయని తప్పులకు శిక్ష కూడా అనుభవించినట్లు చెప్పింది. ఇక సంజయ్ అమ్మాయిలతో అక్రమ సంబంధాలు అనేది నిజమో.. అప్పుడు డ్రగ్స్ కి అలవాటు పొరపాటు చేశాడు. ఇండస్ట్రీలో ఎవరు మంచివారు ఉన్నారు?.. అందరూ డేటింగ్ లు అంటూ కలవట్లేదా? నా భర్త గురించి నాకు అంతా తెలుసుని తెలిపింది.

ఇక సంజూ బయోపిక్ లో ఇటీవల విడుదలైన ఒక డైలాగ్ గురించి మాన్యత మరో విధంగా స్పందించింది. సంజయ్ కి 300 మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని డైలాగ్ కు సంజయ్ 300 కాదు 350 అని రాస్కో అని చెబుతాడు. అయితే కమర్షియల్ టచ్ కోసమే దర్శకుడు ఆ విధంగా తీసి ఉండవచ్చని చెప్పింది. అలాగే తన భర్త ఎంటో తనకు తెలుసని చెబుతూ..ఇక సినిమాలో తనకు తెలియని విషయాలను గురించి దర్శకుడు ఏదైనా చూపిస్తే వాటిని చూస్తాను అని మాన్యత స్పష్టంగా వివరించింది.