ఆ లోపం ఇందులో కనిపించదు : మారుతి

0‘భలే భలే మగాడివోయ్’ – ‘మహానుభావుడు’ చిత్రాలతో సక్సెస్ లను దక్కించుకున్న దర్శకుడు మారుతి తాజాగా నాగచైతన్య – అను ఎమాన్యూల్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్బంగా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంపై అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. విడుదలకు సిద్దం అయిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మారుతి మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.

ఈ సందర్బంగా మారుతి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరోకు తల్లి మరియు కూతురు ఈగో కారణంగా సమస్యలు తలెత్తుతాయి. ఈగో పీక్స్ లో ఉన్న ఆ తల్లి కూతుర్లను ఎలా మెప్పించాడు హీరోయిన్ ను హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ చిత్రంలో చూపించడం జరిగింది. తల్లి కూతుర్ల ఈగో మద్యలో నాగచైతన్య ఎలా సతమతం అయ్యాడు అనేది వినోదాత్మకంగా చూపించడం జరిగింది. తన గత చిత్రాలను చూస్తే భలే భలే మగాడివోయ్ లో నానికి మతిమరుపు ఉంటుంది మహానుభావుడు చిత్రంలో శర్వానంద్కు ఓసీడీ ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో కూడా నాగచైతన్యకు ఏదో ఒక సమస్య ఉండేలా చూపిస్తాను అని అంతా భావిస్తున్నారు. కాని గత చిత్రాల నుండి బయటకు వచ్చి ఈ చిత్రం కథను తయారు చేశారు.

‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో హీరో పాత్రకు ఎలాంటి సమస్య ఉండదు. హీరోయిన్ – మరియు ఆమె తల్లి ఈగోల వల్ల మాత్రమే హీరో పాత్రకు సమస్య ఉంటుందని మారుతి పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రానికి టైటిల్ లో రెడ్డి అని ఉంటే పవర్ ఫుల్ గా ఉంటుందని భావించి ఇది పెట్టాను. రమ్యకృష్ణ గారికి రెడ్డి పదం బాగా సూట్ అవుతుంది. శైలజ రెడ్డి పాత్రలో ఆమె బాగా సెట్ అయ్యారు. అందుకే సినిమాకు శైలజ రెడ్డి అల్లుడు అని పెట్టాము. అలా కాకుండా రంగమ్మ నాయుడు అల్లుడు లేదా మరేదైనా పేరుతో అల్లుడు అని టైటిల్ పెడితే సినిమాకు ఇంతగా హైప్ వచ్చేది కాదేమో అంటూ మారుతి అభిప్రాయం వ్యక్తం చేశాడు.