‘కాటమరాయడు’ ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్స్ !

0katamarayudu-new-posters-2పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం ఇంకొద్ది గంటలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే అన్ని థియేటర్లలోనూ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈరోజు అర్థరాత్రి నుండే ఏపీ, తెలంగాణాల్లో ప్రీమియర్ల రూపంలో సినిమాను ప్రదర్శించనున్నారు. ఆన్ లైన్లో టికెట్ల అడ్వాంస్ బుకింగ్ కూడా తారా స్థాయిలోనే జరిగింది. ఇప్పటికే అన్ని థియేటర్లలో మొదటి రోజు అన్ని షోల టికెట్లు దాదాపుగా పూర్తైపోయాయి.

సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజవుతోంది. ఒక్క ఓవర్సీస్లోనే 230 కు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నారు. తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ఓవర్సీస్ రిలీజ్. దీనికి తోడు సంక్రాంతికి వచ్చిన ‘ఖైదీ నెం 150, గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాల తర్వాత ఇప్పటి వరకు మరో పెద్ద సినిమా విడుదలకాకపోవడం, సినీ జనాలు పెద్ద హీరో సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అలాగే థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసిరానుంది. ఇక వేసవి సెలవులు కావడం, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు పోటెత్తే చాన్సుంది. వీటన్నింటినీ మించి పవన్ కు ఎలాగూ అశేష అభిమాన గణం ఉండనే ఉన్నారు కనుక మొదటిరోజు ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 20 కోట్లకు పైనే ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.