భారీ ఓపెనింగ్స్ అందుకోనున్న ‘భరత్ అనే నేను’ !

0భారీ బడ్జెట్ తో రూపొందిన మహేష్ బాబు, కొరటాల శివల ‘భరత్ అనే నేను’ చిత్రం ఈరోజే థియేటర్లలోకి దిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఎక్కువ మొత్తం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ముందు నుండి భావిస్తున్నట్టు రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

అంతేగాక ఓవర్సీస్లో ప్రీమియర్ల రూపంలో 2000 షోల ద్వారా ప్రదర్శితమైన ఈ చిత్ర్రం మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక రేపు, ఎల్లుండి వారాంతపు రోజులు కావడంతో వసూళ్లు మరింత పుంజుకునే అవకాశాలున్నాయి. చిత్రం ఏయే ఏరియాల్లో ఎంత మొత్తం వసూళ్లు చేసింది వంటి వివరాలు తెలుసుకోవాలంటే 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.