ప్రారంభమైన మాస్టర్ ఎన్టీఆర్ ‘దానవీరశూరకర్ణ’

0

నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు కుటుంబం నుండి మరో వారసుడు సినిమా పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, స్వర్గీయ జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ ‘దానవీరశూరకర్ణ’ అనే బాలల సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ముహూర్త కార్యక్రమం నేడు హైదరాబాద్, సారథి స్టూడియోస్ లో జరిగింది. మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రను పోషిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ నివ్వగా, కళ్యాణ్ రామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి నందమూరి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.

పూర్తిస్థాయి బాలల పౌరాణిక చిత్రానికి జె.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.హెచ్. వెంకటేశ్వరరావు, జె.బాలరాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్.సుధాకరరెడ్డి సినిమాటోగ్రాఫర్.
Please Read Disclaimer