ఒక్క మే నెలలో 8 పెద్ద సినిమాలు…

0వేసవి వేడి పెద్ద సినిమాలతో మరింత వేడి ఎక్కబోతుంది. ఈ నెల చివరి వారం తో సినిమా వేడి మొదలు కాబోతుంది. ఒక్క మే నెలలో దాదాపు ఎనిమిది సినిమాలు రాబోతున్నాయి. ముందుగా ఈ నెల 30 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం మూవీ రాబోతుంది. దీని తర్వాత మహేష్ ‘భరత్ అనే నేను’ రజనీకాంత్ ‘కబాలి’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ లాంటి పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజి సినిమాలు కూడా బరిలో ఉండబోతున్నాయి.

మే 9 న ‘మహానటి’ వస్తుంటే మే 11న ‘రాజు గాడు’ రాబోన్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉగాది కానుకగా ‘నేల టిక్కెట్టు’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదే రోజుకు నాగార్జున-రామ్ గోపాల్ వర్మల ‘ఆఫీసర్’ విడుదల కాబోతుంది. మొత్తానికి వేసవి అంత సినిమాలతో అభిమానులు తెగ ఎంజాయ్ చేయచ్చు అన్నమాట.