24గంటలు కాలేదు.. 30లక్షలకుపైగా వ్యూస్‌

0Nani-MCA‘ఎప్పుడైనా షర్ట్‌ బటన్‌ వూడిపోతే పిన్నీస్‌ పెట్టుకొని మేనేజ్‌ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్‌ చేసి, టోర్న్‌ జీన్స్‌లా కలర్‌ ఇచ్చావా?..’ అంటూ విడుదలైన ‘ఎంసీఏ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ‘ఫిదా’ భామ సాయిపల్లవి కథానాయిక. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

శుక్రవారం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలై 24 గంటలు కాకముందే 30 లక్షల మందికిపైగా ఈ టీజర్‌ను చూశారని నాని ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన స్పందన లభించిందంటూ ఫేస్‌బుక్‌ వేదికగా అందరికీ ధన్యవాదాలు చెప్పారు. డిసెంబరులో ‘ఎంసీఏ’ పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ టీజర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.

నాని ఈ చిత్రం తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’లో నటించనున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క నాని, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం కూడా రాబోతోంది.