రవితేజకు మీడియా ఫ్లాట్ అయిపోయింది

0కొంతమంది హీరోలు మీడియాను ఎలా ట్రీట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి చప్ప సినిమాలకు పోనివ్ అంటూ మంచి ప్రమోషన్లను చేసిన వారిని కూడా.. వారికి నచ్చినట్లు రాయలేదనో రివ్యూ నెగెటివ్ గా ఉందనో ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తుంటారు. ట్వీట్లేస్తుంటారు. అయితే తాత నాన్న మామ అంటూ ఇండస్ర్టీలోకి వచ్చినోళ్లకి.. తన స్వశక్తితో పైకొచ్చిన మాస్ రాజా రవితేజ ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. అదంతా చూసి మీడియా కూడా ఫ్లాట్ అయిపోయిందిలే. ఇతను అసలు స్టారేనా అంటూ అందరూ నోరెళ్ళబెట్టేశారు.

ఈ మధ్యకాలంలో రవితేజ గురించి ఎక్కడ చూసినా కూడా నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా విన్నాం. చూశాం. రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నాడనో.. సినిమా కథలను సరిగ్గా ఎంచుకోవట్లేదనో.. అతని తమ్మడితో పాటు అతను కూడా డ్రగ్స్ విషయంలో దొరికిపోయాడనో.. తమ్ముడు చనిపోతే చూడ్డానికి కూడా రాలేదనో.. ఇలా చాలా విషయాల్లో రవితేజ పేరు ఎప్పటికప్పుడు నానుతూనే వచ్చింది. అయితే తమ్ముడి విషయంలో తమ గురించి అలా రాయొద్దని.. అతని హ్యాపీ ఫేస్ ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నామని.. అందుకే దహనసంస్కారాలకు రాలేదని.. హంబుల్ రిక్వెస్ట్ అంటూ అప్పట్లో రవితేజ చెప్పాడు. మిగతా విషయాల గురించి ఎప్పుడూ కామెంటే చేయలేదు. అయితే ఇవన్నీ దృష్టిలోపెట్టుకుని ‘నేల టిక్కెట్’ సినిమా ప్రమోషన్స్ టైములో మీడియాపై సెటైర్లు వేస్తూ చురకలు అంటిస్తాడేమో అనుకుంటే.. తను ఎప్పటి విషయం అప్పుడే మర్చిపోతాను అన్నట్లు ప్రవర్తించాడు రవితేజ.

తనను ఏ ప్రశ్న అడిగినా కూడా నవ్వుతూ తుళ్ళుతూ సమాధానం చెబుతూ.. మీడియాను కూడా తన జోకులతో నవ్విస్తూ.. నేల టిక్కెట్ సినిమాతో ఎంజాయ్ చేస్తారని చెబుతూ.. భలే బిహేవ్ చేశాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే.. మీడియాను ఏమీ అనలేదు కాబట్టి రవితేజ గ్రేట్ అని కాదు.. తప్పులు అనేవి కొన్నిసార్లు మీడియా సైడ్ నుండి దొర్లొచ్చు (అది కూడా ఎక్కడో ఓ చోట) కొన్నిసార్లు స్టార్లు కూడా చేస్తారు.. వాటి గురించి ఎండగట్టాలి అనుకుని టంగ్ స్లిప్ అయిపోయి రిలేషన్ పాడుచేసుకోకుండా మాస్ రాజా ప్రవర్తించిన తీరు అమోఘం. నోరుంది కదా అని బూతులు తిట్టేసి.. ట్విట్టరుంది కదా అని ట్వీట్లూ వేసేసే స్టార్లకు రవితేజను చూశాక జ్ఞానోదయం కలగాల్సిందే మరి.