పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్లపాటు సహజీవనం చేసి…

0Medical-student-పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ నర్సింగ్ విద్యార్థినితో ఆరేళ్లపాటు సహజీవనం చేసి మరో యువతిని పెళ్లాడిన వైద్యవిద్యార్థి బాగోతం పూణే నగరంలో జరిగింది. పూణే నగరంలోని హదప్సర్ ప్రాంతానికి చెందిన వైద్యవిద్య చదువుతున్న 32 ఏళ్ల యువకుడు నర్సింగ్ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆరేళ్లపాటు ఆమెతో సహజీవనం చేశాడు. తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని, అత్యవసరమని చెప్పి నర్సింగ్ విద్యార్థి నుంచి మూడులక్షల రూపాయలు తీసుకున్నాడు. అనంతరం నర్సింగ్ విద్యార్థినికి తెలియకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన నర్సింగ్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకున్నామని పోలీసు అధికారిణి సుప్రియ చెప్పారు.