దూకుడు భామ బాలీవుడ్ అరంగేట్రం

0Meenakshi-Dixitదూకుడు.. బాద్ షా చిత్రాలకుగాను టైటిల్ ట్రాక్స్ లో కనిపించిన భామ మీనాక్షి దీక్షిత్. ఇప్పటివరకూ దక్షిణాది సినిమాల్లోనే కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రతిభ చూపేందుకు సిద్ధమైపోయింది. తమిళ్ మూవీ తెనాలి రామన్ లో తన ట్యాలెంట్ చూపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ కామెడీ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.

బరాని జయ్ పాల్ దర్శకత్వంలో రూపొందుతున్న టక్కర్ చిత్రం ద్వారా బాలీవుడ్ లోనూ ట్యాలెంట్ చూపిస్తానంటోంది. ‘టక్కర్ లో నేను ఓ ఇండిపెండెంట్ ముస్లిం మహిళ పాత్రలో కనిపించబోతున్నాను. ఓ సాంప్రదాయ పద్ధతులను పాటించే కుటుంబానికి చెందిన యువతిగా కనిపించనున్నాను. ఫుల్ ప్లెడ్జెడ్ గా కామెడీ నిండిన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓ గ్రూప్ నన్ను కిడ్నాప్ చేస్తుంది. అక్కడి నుంచి మొదలయ్యే కిడ్నాప్ డ్రామా బోలెడన్ని నవ్వులు పంచుతుంది’ అని చెప్పింది మీనాక్షి.

తెలుగు సినిమాల్లో తనకు అంతగా అవకాశాలు రావడం లేదని చెబుతోంది మీనాక్షి. ‘టాలీవుడ్ నుంచి నాకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. అదే సమయంలో తమిళ్ నుంచి మాత్రం పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కోసం ఆఫర్స్ వస్తున్నాయి. ఇవి ఆసక్తిగా ఉండడంతో వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాను’ అని చెప్పింది మీనాక్షి దీక్షిత్. ప్రభురాజ్ దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ మూవీ లుప్త్ ద్వారా త్వరలో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది ఈ బ్యూటీ. హారర్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ మూవీ.. ఆడియన్స్ మెప్పిస్తుందని మీనాక్షి అంటోంది.