సన్నజాజిలా తయారైన మీరా జాస్మిన్

0

తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి మీరా జాస్మిన్ పేరు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ‘భద్ర’.. ‘గుడుంబా శంకర్’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది ఈ మలాయాళి భామ. ఇక విశాల్ డెబ్యూ సినిమా ‘పందెంకోడి’ లో కూడా మీరానే హీరోయిన్. దాదాపు సౌత్ భాషలన్నిటిలో నటించిన ఈ భామ 2016 లో పెళ్ళి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. భర్త అనిల్ జాన్ తో కలిసి అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిపోయింది.

అప్పటి నుంచి మీరా జాస్మిన్ కు సంబంధించిన న్యూస్ ఏదీ మీడియా లో పెద్దగా రాలేదు. కానీ చాలా రోజుల తర్వాత మీరా జాస్మిన్ ఫోటోలు ఇంటర్నెట్ లోకి రావడం.. వైరల్ కావడం చకచకా జరిగిపోయింది. ఈ ఫోటోలు మీరా జాస్మిన్ సోదరి వివాహం సందర్భంగా తీసినవని సమాచారం. ఇంతకు మునుపు మీరా కాస్త చబ్బీగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం స్లిమ్ గా బ్యూటిఫుల్ గా ఉంది. వివాహం తర్వాత బరువు పెరుగుతారని అంటూ ఉంటారు.. కానీ మీరా జాస్మిన్ మాత్రం సన్నజాజిలా స్లిమ్ముగా మారి అందరికీ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఈ ఫోటోలో మీరా ఎవరితో పోజిచ్చిందో తెలుసు కదా. మలయాళ స్టార్ హీరో దిలీప్. ఈ ఫోటో బైటకు రావడంతోనే దిలీప్ – మీరా జాస్మిన్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని మాలీవుడ్ లో గుసగుసలు మెదలయ్యాయి. దిలీప్ – మీరా జాస్మిన్ గతంలో మూడు సార్లు కలిసి నటించారు. మీరా రిఫ్రెషింగ్ లుక్ చూస్తుంటే మలయాళం సినిమాలే కాదు తెలుగు సినిమాల్లో కూడా నటించేలా ఉంది.
Please Read Disclaimer