జూనియర్ కెజిఎఫ్ బేబీ పరిచయం

0

కన్నడలో ఎంత పెద్ద పేరున్నా యష్ గురించి ప్రపంచానికి తెలిసింది కేజిఎఫ్ తర్వాతే. బాషతో సంబంధం లేకుండా అది సాధించిన విజయం అనూహ్యమైంది. పార్ట్ 2 షూటింగ్ మొదలు కాకుండానే క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకోవడం బాహుబలి తర్వాత ఒక్క దీనికే సొంతమైంది. యష్ పాపులారిటీ ఊహించని రేంజ్ కు చేరుకుంది. కొన్నాళ్ళ క్రితమే యష్ తండ్రైన సంగతి తెలిసిందే.

ఇప్పుడా పాపను పరిచయం చేస్తూ యష్ తన ట్విట్టర్ లో అధికారికంగా పోస్ట్ చేశాడు. తన ప్రపంచాన్ని పాలించబోయే రాణిగా వర్ణిస్తూ పేరు ఇంకా పెట్టలేదని ప్రస్తుతానికి వైఆర్ అని పిలుచుకుందామని చెప్పాడు. వై అంటే యష్ ఆర్ అంటే భార్య రాధిక పండిట్ అని అర్థం. యష్ రాధిక పండిట్ లది ప్రేమ వివాహం. మనకు చైతు సామ్ లాగా వీళ్ళది సినిమా ప్రేమ పెళ్లి. శాండల్ వుడ్ లో మోస్ట్ క్రేజీ జంటగా వీళ్ళకు పేరుంది.

ఇప్పుడీ పాప ఎంట్రీతో వీళ్ళ ఆనందం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 మీద ఫోకస్ పెట్టిన యష్ మనకు మళ్ళి కనిపించేది వచ్చే సంవత్సరమే. కొన్ని కీలక మార్పులతో పాటు స్టార్ క్యాస్ట్ ని భారీగా సెట్ చేసుకోవడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. తెలుగులో సైతం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కేజిఎఫ్ శాటిలైట్ లో సైతం సంచనాలకు వేదికగా నిలిచింది. అది ఈ పాప వచ్చిన వేళావిశేషమని యష్ ఇంతకు ముందే చెప్పాడు
Please Read Disclaimer