జనసేన పార్టీకి మెగా డాటర్ ప్రచారం

0

మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో మెగా హీరోలు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక ప్రచారం చేస్తోంది. తాజాగా ఆమె ‘సూర్యకాంతం’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తాజాగా ఒక కార్యక్రమంలో నిహారిక తన బాబాయి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చింది.

సూర్యకాంతం ప్రమోషన్ లో పాల్గొనేందుకు వెళ్లిన నిహారికను మాట్లాడనివ్వకుండా పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేసిన నేపథ్యంలో ఆమె తన బాబాయి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చాలా కష్టపడుతున్నారు. నాకు ఇక్కడ ఓటు లేదు నా బదులు మీరు ఓటు వేసి బాబాయిని గెలిపించండి అంటూ నిహారిక రిక్వెస్ట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో తాను టీ గ్లాస్ పట్టుకుని ఉన్న ఫొటోను ఎన్నికల వరకు పోస్ట్ చేస్తాను అంటూ కూడా నిహారిక ఫ్యాన్స్ కు హామి ఇచ్చింది. నిహారిక తన సినిమా ప్రమోషన్ లో బాబాయికి ఓటు వేయాలని అడగడంను మెగా ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

నిహారిక హీరోయిన్ గా నటించిన సూర్యకాంతం సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో నిహారిక ఉంది. ఇప్పటి వరకు నిహారిక హీరోయిన్ గా చేసిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మరి ఈ చిత్రం అయినా నిహారికకు సక్సెస్ ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.
Please Read Disclaimer