సంక్రాంతికి మెగా సందడి లేదు.. ఎవరికి వారే!

0

ఏ పండుగ ఎక్కడ చేసుకున్నా ప్రతి ఏడాది సంక్రాంతికి మాత్రం చిరంజీవికి చెందిన బెంగళూరు ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఆ ఆనవాయితి కొనసాగుతూ వస్తోంది. బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ కు మెగా ఫ్యామిలీ అంతా కూడా రెండు మూడు రోజులు ముందుగానే వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసే వారు. గతంలో మెగా ఫ్యామిలీ బెంగళూరు ఫామ్ హౌస్ లో చేసిన సందడి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. కాని ఈసారి మాత్రం బెంగళూరు ఫామ్ హౌస్ సంక్రాంతి సందర్బంగా వెల వెల బోయింది.

సంక్రాంతి పండుగకు తప్పకుండా అంతా కూడా బెంగళూరు ఫామ్ హౌస్ కు రావాలంటూ చిరంజీవి ఆదేశించే వారట ఎవరైనా రాకుంటే వారిపై సీరియస్ గా స్పందించే వారట. చిరంజీవి అంత సీరియస్ గా సంక్రాంతి వేడుకలకు ప్రాముఖ్యత ఇచ్చే వాడు కాని ఈసారి మాత్రం తన 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ కోసం సంక్రాంతి వేడుకలకు దూరం అయ్యాడు. మెగాస్టార్ ఈసారి ఆసక్తి చూపించక పోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు ఈసారి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేశారు.

పండుగ రోజు చిరంజీవి – చరణ్ లు ఇంట్లోనే పండుగ జరుపుకుని – షూటింగ్ కు వెళ్లారు. ఉపాసన ఇన్ స్టాగ్రామ్ ఆఫీస్ లో జరిగిన సంక్రాంతి కార్యక్రమాల్లో పాల్గొంది. ఇక అల్లు అర్జున్ తన తాత సొంత ఊరు పాలకొల్లులో పండుగ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా గుంటూరు జిల్లాలో పండుగ జరుపుకున్నాడు. మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా సంక్రాంతికి ఎక్కడి వారు అక్కడ అన్నట్లుగా అక్కడ కొందరు అక్కడ కొందరు పండుగ జరుపుకున్నారు. వచ్చే సంక్రాంతికి అయినా మెగా ఫ్యామిలీ అంతా కలుస్తారేమో చూడాలి.




Please Read Disclaimer