సరి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్న మెగా హీరోలు

0Katamarayudu-on-senti-modeమెగా హీరోలు ఒక సరి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరైనోడు, రాంచరణ్ ధ్రువ, మెగా స్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ 150 , లేటెస్ట్ గా సాయిధరమ్ తేజ్ విన్నర్ , ఈ సినిమాలన్నీటికీ కూడా ఆడియో ఫంక్షన్ లేకుండానే ఒక్కో సాంగ్ ని యు టూబ్ లో విడుదల చేస్తూ , సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసారు.

పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ కూడా కాటంరాయుడు సినిమాకు మెగా హీరోల ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ , అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న కాటమరాయుడు సినిమాకి ఆడియో ఫంక్షన్ చెయ్యకుండా, విడుదలకు సిద్ధం అయ్యే వారం రోజుల ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది.