మహేష్ సూపర్ ప్లెక్స్ లో ఇదే మొదటి ఫిల్మీ ఈవెంట్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యే సునీల్ నారంగ్ తో కలిసి ఎఎంబీ సినిమాస్ మల్టిపెక్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. సాధారణ మల్టిప్లెక్సుల కంటే ఒక మెట్టు ఎక్కువ గా రిచ్ ఇంటీరియర్స్ తో.. లగ్జరీకి మారు పేరుగా ఈ మల్టి ప్లక్స్ పేరు తెచ్చుకుంది. కొత్త మల్టిప్లెక్స్ కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఎలాగూ ఉంటుంది. వీటన్నిటికీ తగ్గట్టే ధరలుకూడా ఉన్నాయి. పిండి కొద్ది రొట్టె అన్నారు కదా ఇదీ అలాగే అనుకోవాలి. మరి లగ్జరీ ఊరికే వస్తుందా?

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎఎంబీ సినిమాస్ ఫిల్మీ ఈవెంట్ లకు ఒక వేదిక కానుంది. మెగా హీరో వరుణ్ తేజ్ – సంకల్ప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అంతరిక్షం 9000 kmph’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఎఎంబీ సినిమాస్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వ తారీఖున ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ‘అంతరిక్షం’ టీమ్ మెంబర్స్ అందరూ హాజరవుతారట. ఈ లెక్కన ఫ్యూచర్ లో జరిగే సినిమా ఈ వెంట్లకు హైదరాబాద్ లో మరో కొత్త వేదిక దొరికినట్టే.

స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘అంతరిక్షం’ లో అదితి రావు హైదరీ.. లావణ్య త్రిపాఠి లు హీరోయిన్లు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఘాజి’ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Please Read Disclaimer