బోయపాటికి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన మెగాస్టార్!

0chiranjeevi-and-Boyapati-Srinuయాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘జయ జానకి నాయక’ గత శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ తో పాటు పాజిటివ్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. సినిమాను చూసిన వారంతా బోయపాటి యాక్షన్ ను మాత్రమేగాక బలమైన ప్రేమ కథని కూడా బాగా చెప్పారని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కూడా బోయపాటికి ఫోన్ చేసి సినిమా విడుదల సందర్బంగా విషెస్ చెప్పారని, పాజిటివ్ టాక్ పట్ల అభినందించారని వినికిడి.

ఇలా స్వయంగా మెగాస్టార్ ఫోన్ చేసి మరీ అభినందించడంతో బోయపాటి చాలా హ్యాపీగా ఫీలయ్యారట. ఇకపోతే మెగాస్టార్ 152వ చిత్రాన్ని బోయపాటే డైరెక్ట్ చేయనున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్ర పనుల్లో ఉండటం వలన వీరి ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్టును నిర్మాత అల్లు అరవిందే నిర్మిస్తారని బోయపాటి ఇంతకు ముందే కన్ఫర్మ్ చేశారు.