‘మెహబూబా’కి గుమ్మడికాయ్

0



తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘మెహబూబా’. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన తన తనయుడు ఆకాష్‌ను ఈసినిమాతో రీలాంచ్‌ చేస్తున్నాడు పూరి. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్‌ లవ్‌ స్టోరిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌, ప్యాచ్‌ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరోయిన్‌ ఛార్మీ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ‘విజయవంతంగా మెహబూబా షూటింగ్ మొత్తం పూర్తి చేశాము. ఆనందంగా, సంతృప్తిగా ఇంటికి తిరిగి వెలుతున్నాం. ఈ పోరాటంలో మాతో కలిసి ప్రయాణించిన అందరికీ కృతజ్ఞతలు’ అంటూ యూనిట్‌ సభ్యులతో దిగిన ఫోటోలను ట్వీట్‌ చేసింది ఛార్మీ.