మెహర్ గుండె బద్దలైపోయిందట!!

0బాలీవుడ్ కపుల్ అర్జున్ రాంపాల్- మెహర్ జెస్సియాల కాపురం గురించి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. మూడేళ్ల క్రితమే విడిపోతారనే టాక్ వచ్చింది. అయితే.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి మళ్లీ కాపురాన్ని నిలబెట్టేందుకు అందరూ ప్రయత్నం చేశారు.

కానీ పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగానే ఉండవు. ముఖ్యంగా అసలు వీరిద్దరి మధ్య విబేధాలకు కారణమైన వ్యవహారం.. మళ్లీ మొదటికి వచ్చిందట. అందుకే విడిపోతున్నట్లు మీడియాకు ఒక లెటర్ కూడా పంపారు. సుసానే ఖాన్ తో అర్జున్ రాంపాల్ క్లోజ్ గా ఉండడాన్ని మెహర్ ఏమాత్రం జీర్ణయించుకోలేకపోవడమే అందుకు కారణం అని తెలుస్తోంది. అయితే.. తమ ఇద్దరి మధ్య కేవలం స్నేహం తప్ప మరింకేమీ లేదని చెప్పుకొచ్చారు వారిద్దరూ. ఈ విషయంపై నమ్మబలికారు కూడా. దీంతో అర్జున్-మెహర్ కాపురం చక్కబడినట్లే కనిపించింది. కానీ రీసెంట్ గా తన గుండెలోని బాధ అంతటినీ.. బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ లో వెళ్లగక్కి బావురు మంది మెహర్. తరచుగా ఈ చర్చికి వస్తూ ఉంటుంది మెహర్.

తాజాగా తన కుటుంబ సభ్యులు అయిన ఓ వ్యక్తితో వచ్చిన మెహర్ జెసియా.. అక్కడ గుండెలు పగిలేలా ఏడిచి తన బాధను చెప్పుకుందట. ఇప్పటికీ అర్జున్-సుసానేల మధ్య స్నేహం.. బంధం.. అనుబంధం.. పూర్వపు స్థాయిలోనే కొనసాగుతున్నాయని.. కాకపోతే సీక్రెట్ గా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఈ మధ్యనే మెహర్ కు తెలియడమే ఇప్పుడీమె విలపించడానికి కారణంగా చెప్పవచ్చు.