బెంజ్ నుంచి సరికొత్త కారు

0mercedes-benz-launches-amg-జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ మార్కెట్లోకి ఏఎంజీ జీఎల్‌సీ 43 కూపే మోడల్‌ను విడుదల చేసింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు ధర రూ.74.8 లక్షలుగా నిర్ణయించింది. 43 ఏఎంజీ లైన్‌లోనే తయారైన ఈ నూతన ఎస్‌యూవీ కూపేలో అదనపు ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు మెర్సిడెజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోలాండ్ ఫోల్జర్ తెలిపారు. పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన కారు 367 హెచ్‌పీ శక్తినివ్వనున్నదని, అలాగే 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.9 సెకండ్లలో అందుకోనుందన్నారు.

ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన 8వ మోడల్ ఇది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌లు ఈ కారులో ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో 7,171 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు ఆయన చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్నదనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణెలలో ఏఎంజీ పనితీరు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.