మీటూ ఉద్యమాన్ని హైజాక్ చేశారు : విశాల్

0

తమిళ సినీ పరిశ్రమలో కీలక వ్యక్తి అయిన విశాల్ ఈమద్య మీటూ ఉద్యమం గురించి తరచు మాట్లాడుతూ ఉన్నాడు. మీటూ ఉద్యమంకు తమిళ సినీ పరిశ్రమ మద్దతు తెలుపుతుందని చెబుతూనే అసత్య ఆరోపణలు సరి కాదని – మీటూ ఉద్యమంను తప్పుదారి పట్టించవద్దని ఆయన కోరుతూ వస్తున్నాడు. ఆడవారి రక్షణ కోసం తమిళ సినిమా పరిశ్రమలో పూర్తి చర్యలు తీసుకుంటున్నామని – ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని – తాము లైంగికంగా వేదింపులకు గురయ్యామని ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తామని విశాల్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి మీటూ ఉద్యమం గురించి విశాల్ స్పందించాడు.

విశాల్ మాట్లాడుతూ.. మీటూ ఉద్యమం హైజాక్ అయినట్లుగా అనిపిస్తుంది. నేను మాట్లాడేది తమిళం – తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాదని – ఇండియాలో జరుగుతున్న మీటూ ఉద్యమం గురించి అన్నాడు. ఆడవారి రక్షణ అనేది చాలా కీలకం. వారు వర్క్ చేసే వద్ద వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మహిళలను లైంగిక వేదింపుల నుండి కాపాడటం మన బాధ్యత. అందుకే నేను ఇటీవల నటించిన సండకోజి 2 చిత్రం లో కీర్తి సురేష్ – వరలక్ష్మి నటించారు. వారిద్దరికి కూడా ఎలాంటి వేదింపులు లేకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. నా సినిమా షూటింగ్ ఏదైనా జరుగుతుంది అంటే ఆడవారి రక్షణకు పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు.

మీటూ ఉద్యమం అనేది ఒక మంచి ఉద్దేశ్యంతో ప్రారంభం అయ్యింది. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు మీటూ ఉద్యమం ద్వారా మంచి జరుగుతుందని భావించాం. కాని మీటూ ఉద్యమం హైజాక్ అవ్వడం – స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వాడటం వల్ల ఈ ఉద్యమం నీరుకారి పోతుందేమో అని విశాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

విశాల్ పై తాజాగా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అందుకే విశాల్ మీటూ ఉద్యమం హైజాక్ అయ్యిందని అంటున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer