తమిళనాట మరో భారీ బయోపిక్

0తెలుగులో ఎన్టీఆర్ కు ఎంత పేరుందో.. తమిళ నాట ఎంజీఆర్ కు కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్నాయి. అలాంటి గొప్ప నటుడు రాజకీయ నాయకుడి బయోపిక్ చిత్రం తీయాలని చాలామంది ప్రయత్నించినా అది జరగలేదు. తాజాగా ఏ.బాలక్రిష్ణన్ అనే దర్శకుడు సాహసం చేస్తున్నాడు. ‘కామరాజర్’ ఇతివృత్తంతో బాలక్రిష్ణన్ తీసిన చిత్రాలు అందరి చేత ప్రశంసలు పొందాయి. తాజాగా ఎంజీఆర్ బయోపిక్ ను రమణ కమ్యూనికేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి స్వయంగా ఎంజీఆర్ స్థాపించిన పార్టీ నుంచి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఫళనిస్వామి ముఖ్య అతిథిగా రాబోతుండడం విశేషంగా చెప్పవచ్చు.

ఎంజీఆర్ చిత్ర వివరాలను తాజాగా బాలక్రిష్ణన్ వెల్లడించారు. ఎంజీఆర్ ముఖ కవళికలతో ఉండే సతీష్ కుమార్ ఆయన పాత్రలో నటిస్తాడని చెప్పారు. ఎంజీఆర్ సతీమణి జానకీగా నటి రిత్విక – ఎంఆర్ రాధగా బాలాసింగ్ దర్శకుడు పంతులుగా వైజీ మహేంద్రన్ – ఎంజీఆర్ సోదరుడు చక్రపాణిగా మలయాళ నటుడు రఘు – నాటకరంగ యజమానిగా దీనదయాళన్ – ప్రాణ స్నేహితుడిగా వైయాపురి మొదలగు కీల పాత్రలు చేస్తారని తెలిపాడు.

ఎంజీఆర్ గత చిత్రాలకు పాటలు రాసిన వారితోనే ఈ సినిమాకు పాటలు రాయిస్తున్నట్టు బాలక్రిష్ణన్ తెలిపారు. ఈ చిత్రం కోసం ఐదుగురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారని తెలిపారు.