“మిడిల్ క్లాస్ అబ్బాయి” ట్రైలర్ చుడండి

0‘మాది మిడిల్‌ క్లాస్‌ అన్నా.. అర్ధ రూపాయి పెట్రోలు ధర పెరుగుతుందంటే అర్ధరాత్రి పెట్రోలు బంకు దగ్గర అర కిలోమీటరుక్యూలో నిలబడతాం.. అలాంటిది మా ఫ్యామిలీ జోలికి వస్తే..’ అంటూ హెచ్చరిస్తున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎంసీఏ’. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌’ అనేది ఉప శీర్షిక. సాయిపల్లవి కథానాయిక. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో నాని అన్నయ్య పాత్రలో రాజీవ్‌ కనకాల, వదినగా భూమిక కనిపించారు. భూమిక తన మరిది నానితో ఇంటి పని చేయిస్తున్న దృశ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి. ‘పిన్నీ.. గయ్యాళి అత్త చేతిలో పడ్డ కొత్త కోడలైంది నా పరిస్థితి’ అంటూ ఆమనికి నాని ఫోన్‌ చేసి చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. మరోపక్క నాని ప్రియురాలి పాత్రలో సాయిపల్లవి ‘ఎప్పుడు పెళ్లి చేసుకుందాం’ అంటూ ఆయన వెంట పడుతూ కనిపించారు. ఫ్యామిలీ డ్రామాతో పాటు మాస్‌ ప్రేక్షకులు మెచ్చే యాక్షన్‌ సన్నివేశాలకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ సమకూర్చారు. డిసెంబరు 21న ‘ఎంసీఏ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.