తాజ్‌మహల్‌ ప్రవేశ ద్వారం కూలిపోయింది..

0ప్రేమకు చిహ్నం గా చెప్పుకునే తాజ్‌మహల్‌ అంటే అందరికి ఇష్టం..అలాంటి తాజ్‌మహల్‌ ప్రవేశ ద్వారంలోని ఓ పిల్లర్ కూలిపోయింది. గురువారం ఆగ్రా లో కురిసిన భారీ వర్షానికి తాజ్‌మహల్‌ ప్రవేశ ద్వారంలోని పిల్లర్‌ ధ్వంసమైంది. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది, ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి పధ్నాలుగో సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండి పోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్‌ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తనకోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తరువాత 1632వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్ మహల్‌కు ఒక ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతుంది.