పవన్ కళ్యాణ్ మోడీకి కోవర్టు

0జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మోదీకి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. రెండు రాష్ట్రాల సీఎంలకు పవన్‌ మార్కులేస్తున్నారని, అసలు ఆయన మార్కెలెవరికి కావాలి? మండిపడ్డారు.

టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తుంటే.. దానికి భిన్నంగా మాట్లాడుతున్నారని, కేంద్రం రాసిచ్చిన స్క్రిప్టునే పవన్‌ చదివి వినిపించారని, మొన్నటి మాటలకు, నేటి మాటలకు స్పష్టమైన తేడా ఉందన్నని వివరించారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా హామీ ఇవ్వలేదని పవన్‌ అనడం ఆశ్చర్యంగా ఉందని, మోదీకి వ్యతిరేకంగా పవన్‌ ఎందుకు ఒక్కమాట కూడా మాట్లాడలేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు.