అపరిచితుడు గెటప్‌లో కేటీఆర్

0Minister-KTR-in-Aparichitudసోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ అపరిచితుడి గెటప్. ఎవరీ అపరిచితుడంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఒకటే కామెంట్లు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు, టీఆర్ఎస్ పార్టీలోనూ కీలక పాత్రపోషిస్తోన్న మినిస్టర్ కేటీఆర్ పెట్టిన ఈ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మార్నింగ్ వాక్ చేస్తున్న సందర్భంలో తీసిన ఫొటోని కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘మార్నింగ్ వాక్ 5 కెఎమ్’ అంటూ ట్యాగ్ జోడించి స్మైలింగ్ ఎమోజీ ఇచ్చారు కేటీఆర్. న్యూ ఇయర్ గోల్స్, గెట్ ఫిట్ అంటూ యాష్ ట్యాగ్ జోడించి ఈ కింది ఫోటో పోస్ట్ చేశారు. తద్వారా తన ఫాలోవర్స్‌కి హెల్త్ ఇంపార్టెన్స్‌ను ఇలా చెప్పకనే చెప్పారు.