10 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతి శోభనం

0



pehredaar-piya-kiరేటింగుల కోసం ఏదయినా చల్తా హై. సోనీ టీవీలో హిందీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు Pehredaar Piya Ki. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రారంభంలో ఏదో అలా సాగింది కానీ ఆ తర్వాత దాని విశ్వరూపం చూసి అవాక్కవుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఆ సీరియల్లో 10 ఏళ్ల బాలుడు 25 ఏళ్ల యువతి నుదుటను సింధూరం పెడ్తాడు.

ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది వ్యవహారమంతా. ఇదే ఎక్కువనుకుంటే అతడితో ఆ యువతికి శోభనం కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ వాళ్లిద్దరి తిక్కపనులు, బాలుడి తింగరి చేష్టలు చూసి మా పిల్లలు కూడా చెడిపోతారేమో నాయనోయ్ అంటూ ఆ సీరియల్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అభ్యర్థనలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సీరియల్ తక్షణమే నిలిపివేయాలంటూ 4 వేల మందికి పైగా సంతకాలు చేసి మంత్రిగారికి పంపారు. కానీ సీరియల్లో పిల్లవాడి శోభనం సీన్లు మాత్రం ఆగడం లేదు. మరి ఈ సీరియల్ ఆగుతుందో లేదో… చూడండి ఈ వీడియోను…