నంబర్ వన్ కు చేరువలో మిథాలీ

0mithali-rajభారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో నంబర్వన్ ర్యాంకును సొంతం చేసుకునేందుకు అతి కొద్ది దూరంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో మిథాలీ రాజ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలోటాప్ కు చేరడానికి ఐదు పాయింట్ల దూరంలో నిలిచింది మిథాలీ. ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రెండోస్థానంలో నిలిచింది.

మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో మిథాలీ ఆకట్టకుంది. అంతకుముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. తద్వారా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని నంబర్ వన్ కు చేరువగా వచ్చింది. నంబర్ వన్ ర్యాంకులో నిలవడానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో మిథాలీ నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (779) టాప్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, మిగతా భారత మహిళా క్రికెటర్లు ఎవరూ టాప్-10లో నిలవక పోవడం గమనార్హం.