హిందీ పెళ్లిచూపుల సందడి : ట్రైలర్ టాక్

0అప్పట్లో తెలుగు మేకర్స్ పై చాలా విమర్శలు ఉండేవి… అన్నీ రీమేకులేనని. ఇప్పుడు తెలుగు సినిమాలను హాట్ కేకుల్లా కొనుక్కొని రీమేకులు చేసుకుంటున్నారు. అదిగో అలానే విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘పెళ్లిచూపులు’ ఇప్పుడు హిందీలోకెళ్ళింది. ‘మిత్రోం’ పేరుతో రిమేక్ అయిన ఈ సినిమాలో పాపులర్ ప్రొడ్యూసర్ వషు భగ్నాని కొడుకు జాకీ భగ్నాని హీరోగా నటించాడు. కృతిక కమ్రా హీరోయిన్. ‘ఫిల్మిస్తాన్’ ఫేమ్ – నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ డైరెక్టర్. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

ఏవో కొన్ని మైనర్ నేటివిటీ ఛేంజేస్ తప్ప దాదాపు ఒరిజినల్ సినిమాను ఫాలో అయ్యారని అనిపిస్తోంది. హిందీ సినిమానే అయినా గుజరాతి ఫ్యామిలీ నేపథ్యం తీసుకోవడంతో సినిమా ఫీల్ కొంచెం ఫ్రెష్ గా ఉంది. టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ ఉన్న హీరో జై పాత్రలో జాకీ భగ్నాని కనిపించాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఎదో చెయ్యాలని – సాధించాలని అనుకుంటూ ఉంటాడు గానీ ఏవీ వర్క్ అవుట్ కావు. ఎంబీఎ చదువుకొని ఎదైనా బిజినెస్ చేయాలని తపనతో ఉన్న అవని పాత్రలో హీరోయిన్ కనిపించింది.

తెలుగు లో ఉన్న కామెడి టచ్ హిందీలో కూడా ఉంది. హీరో పెళ్లి చూపుల తర్వాత చెప్పే ‘చాయ్ బహుత్ మీఠీ థీ. చీని థోడా కమ్ డాలో'(టీ చాలా తియ్యగా ఉంది.. చక్కెర తక్కువ వెయ్యండి!) డైలాగ్ .. ‘జేబ్ మే సిర్ఫ్ పాంచ్ సౌ ఔర్ కాన్ఫిడెన్స్ మోదీ జైసా'(జేబులో ఉండేదేమో 500 రూపాయలే.. కానీ కాన్ఫిడెన్స్ మోడీ లా ఉంది! ) లాంటి పంచ్ డైలాగులు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. టాప్ ప్రొడ్యూసర్ తనయుడు హీరో కాబట్టి ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఈ ‘మిత్రోం’ సెప్టెంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోపు మీరూ ఈ ట్రైలర్ పై లుక్కేయండి. కానీ విజయ్ దేవరకొండతో పోల్చి చూడకండి… ఎందుకంటే విజయ్ లాంటి వాళ్ళు రేర్ గా ఉంటారు. కాబట్టి మామూలు కళ్ళతో చూసి హిందీ హీరో కి మార్కులేయండి.