‘ఎంఎల్ఏ’ పబ్లిక్ టాక్..

0కళ్యాణ్ రామ్ , కాజల్ జంటగా నూతన డైరెక్టర్ ఉపేంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన ఎంఎల్ఏ చిత్రం ఈరోజు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ పట్ల ప్రేక్షకులు మంచి స్పందనే తెలియజేస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ స్పందన ను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.

ఫస్టాఫ్ మామూలుగానే ఉన్నప్పటికీ , ఇంటర్వల్ ట్విస్ట్ అదిరిందని అంటున్నారు. సినిమాకు హైలైట్ గా సెకండ్ హాఫ్ నిలిచిందని చెపుతున్నారు. కళ్యాణ్ రామ్ ఎనర్జీ సూపర్ అని, కాజల్ గ్లామర్ అదుర్స్ అంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని చెపుతున్నారు. బ్రహ్మి కామెడీ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచిందని , చాల రోజుల తర్వాత నవ్వులు పోయించాడని అంటున్నారు.

మరికొంతమంది మాత్రం కమర్షియల్ సినిమాలను అస్సలు ఇష్టపడని ప్రేక్షకులకు నచ్చదని , ఇది రొటీన్ కమర్షియల్ మూవీ అని చెపుతున్నారు. ఓవరాల్ గా ఎంఎల్ఏ కు యబో ఏవరేజ్ గా సినిమా కు రేటింగ్ ఇస్తున్నారు.