‘జై బాలయ్య’ ట్వీట్‌తో కీరవాణికి ట్రబుల్స్ !

0Keeravani-Casteist-Fanప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణికి సోషల్ మీడియాలో మరోసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. బాహుబలి 2 విడుదల తర్వాత తాను పరిశ్రమ నుంచి తప్పుకుంటాను అని ప్రకటించే క్రమంలో పలువురు సినీ ప్రముఖులపై కామెంట్స్ చేసి అప్పట్లో ట్విటర్ వార్ ఫేస్ చేసిన కీరవాణి తాజాగా బాలయ్యను ప్రశంసించి మరోసారి అదే రకమైన పరిస్థితిని ఎదుర్కున్నారు. అదేంటి.. కేవలం బాలయ్యను ప్రశంసించినందుకే కీరవాణిని ఇబ్బందిపెట్టాలా అనే సందేహం రావొచ్చేమో!

అయితే, ఆ ట్వీట్‌లో జై బాలయ్య నినాదానికి, జై హింద్ నినాదానికి ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలే ఆయనపై వ్యతిరేకతకి కారణం అయ్యాయి. దేశభక్తితో చేసే జై హింద్ నినాదానికి, జై బాలయ్య నినాదానికి సంబంధం ఏంటి అంటూ కొంతమంది ట్విటర్ యూజర్స్ కీరవాణిపై విమర్శలు గుప్పించారు. సగటు బాలయ్య అభిమానికన్నా కీరవాణి స్పందించిన తీరే తీవ్ర అభ్యంతరకరంగా వుందని ఇంకొందరు ట్వీట్ చేశారు.

 

 

 
 

 

ఇదిలావుంటే, తనపై వచ్చిన ట్వీట్స్‌ని తిప్పి కొట్టడంలోనూ తనదైన స్టైల్ చూపించుకున్నారు కీరవాణి. ఫేక్ డీపీలు కలిగి వుండే వీది కుక్కలకి తన దేశ భక్తి గురించి ఏం తెలుసు అని రిప్లై ఇచ్చిన కీరవాణి.. తాను చివరిసారిగా ఓటు వేశానని, మీరు మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా అని నిలదీశారు. తాను అందరినీ ప్రోత్సహిస్తానని తన విమర్శకులకి తెలియజెప్పే ప్రయత్నం చేశారు కీరవాణి.