హీరోయిన్ కు 24 గంటల పోలీసు భద్రత

0

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్ తనూశ్రీ దత్తా వరుసగా బాలీవుడ్ లో సంచలనం అవుతూనే ఉంది. వరుసగా పలువురు స్టార్స్ పై విమర్శలు చేస్తున్న తనూశ్రీ దత్తాపై తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెల్సిందే. తనపై శివసేన కార్యకర్తలు దాడి చేశారనే అనుమానం ను వ్యక్తం చేసింది. థాకరే నుండి తనకు బెదిరింపు కూడా వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమయంలో ఆమెకు ముంబై పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

తాజాగా తనకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు అంటూ తనూశ్రీ దత్తా ప్రకటించింది. తనకు సెక్యూరిటీ ఇస్తున్నందుకు ముంబయి పోలీసులకు తనూశ్రీ దత్తా కృతజ్ఞతలు చెప్పింది. తన ఇంటి చుట్టు పోలీసులు పహారా కాస్తున్నారంది. హోం మంత్రి దీపక్ కేస్కార్ మాట్లాడుతూ.. తాజాగా తనూశ్రీ దత్తాపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు భద్రత కల్పించాలని నిర్ణయించుకున్నామని – ఆమె భద్రతకు తాము హామీ ఇస్తున్నామన్నాడు.

కేంద్ర మంత్రి వర్గంలోని పలువురు మహిళ మంత్రులు మరియు ఎంపీలు కూడా తనూశ్రీ దత్తాకు మద్దతుగా నిలుస్తున్న కారణంగా ఆమెకు హై సెక్యూరిటీ లభించినట్లుగా సమాచారం అందుతుంది. ఇక బాలీవుడ్ లో పలువురు తనూశ్రీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమెపై దాడికి కూడా ప్రయత్నిస్తున్నారంటూ జాతీయ స్థాయి మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనూశ్రీ కారణంగా బాలీవుడ్ రెండుగా చీలిపోయింది అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Please Read Disclaimer