ఖుష్బూ ఆత్మహత్య

0koosabu-bhaatరంగుల ప్రపంచంలో మరో దీపం ఆరిపోయింది. అహ్మదాబాద్‌కు చెందిన పాపులర్ మోడల్, యాంకర్ ఖుష్బూ భట్ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడిప్పుడే పాపులర్ మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న ఆమె జోధ్‌పూర్ లోని సుకృత్ టవర్‌ లో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం కలకలం రేపుతోంది. ఆ ట‌వ‌ర్స్‌లో త‌న తండ్రి మనీష్‌, అమ్మమ్మలతో కలిసి ఉటుంది. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన ఆమె.. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌కు పాల్పడింద‌ని పోలీసులు చెబుతున్నారు.

ఆత్మహత్య చేసుకుంద‌న్న వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు కూడా లభించలేదు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. కొంతమంది ఈ చావుకి ప్రేమ విఫలం కారణం అంటున్నారు. మరి కొందరు ఆమె ఆర్ధిక ఇబ్బందులు వల్లే ప్రాణం తీసుకుందని అంటున్నారు. నిజాలు తెలియాల్సివుంది.