జయేంద్ర సరస్వతి మహానిర్యాణం.. మోడీ సంతాపం

0అభినవ శంకరులుగా ప్రసిద్ధిగాంచిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహానిర్యాణం పట్ల సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. జయేంద్ర సరస్వతి నిర్యాణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ‘జయేంద్ర సరస్వతి గొప్ప ఆలోచనలు, ఉన్నతమైన సేవతో లక్షలాది భక్తుల హృదయాల్లో జీవించారు. అసంఖ్యాక సమాజ సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని ట్విటర్‌ ద్వారా మోదీ తన సంతాప సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

జయేంద్ర సరస్వతి మహానిర్యాణం దిగ్భ్రాంతికరం. ఆయన ఆధ్యాత్మిక, సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హిందూత్వంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఉన్న జయేంద్ర సరస్వతి శివైక్యం పొందడం బాధాకరం. ఆయన తన మార్గదర్శకత్వంలో కంచి పీఠాన్ని బలమైన సంస్ధగా తీర్చిదిద్దారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.