మోడీ ఇద్దరు పిల్లల్ని పెంచుకోవాలి.. జేసి సలహా

0”ప్రేమతో పనిచేయడం నేర్చుకో! అనాధాశ్రమానికి వెళ్లి ఇద్దరు పిల్లలను తెచ్చి పెంచుకుంటే, ఆ ప్రేమ మాధుర్యమేంటో తెలుస్తుంది! నీకేమి తెలుస్తుంది! అమ్మను ఒకచోట మూలన పారేశావు, ఇంకొక ఆమెను ఇంకో చోట పారేశావు..టింగ్ రంగా అంటూ నువ్వొక్కడివే ఉన్నావు! ప్రేమను పంచు..ప్రేమను స్వీకరించు”ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.

ప్రధాని నరేంద్ర మోదీ ఓ కఠిన శిల అని, ఆయనకు స్పందించే హృదయం లేదని దివాకర్ రెడ్డి విమర్శించారు. ప్రేమాభిమానాలు అంటే మోదీకి తెలియవని.. ఆ పద్ధతిలో అతను పెరగలేదని అన్నారు. చరిత్రను పక్కదోవ పట్టించే పనులు చేయొద్దని, మేము చిత్తశుద్ధితో పోరాడుతున్నామని, ఎంపీలు రాజీనామా చేస్తే ఏపీకి హోదా రాదని.. పదవులకు రాజీనామా చేస్తే కేంద్రాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు జేసి,