మోడీ బయోపిక్ కు డేట్ ఫిక్స్ చేశారు

0

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ మీద సాగిన రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. పక్కా ప్లానింగ్ తో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీలుగా మోడీ బయోపిక్ ను సిద్ధం చేశారన్న పేరుంది. అయితే.. ఈ చిత్రం విడుదల మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటం.. ఈ సినిమాను చూసిన వారు.. కచ్ఛితంగా ఎన్నికల వేళలో విడుదల చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

గాంధీని మించిన మహాత్ముడిగా మోడీని ఈ సినిమాలో చూపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. బీజేపీకి కీలకమైన హిందీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఈ సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్ చేశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్ నటించిన ఈ బయోపిక్ విడుదల తేదీని తాజాగా వెల్లడించారు.

ఈ సినిమా మీద నెలకొన్న వివాదంతో.. రాజకీయ నేతలకు సంబంధించిన ఎలాంటి బయోపిక్ లను ఎన్నికల వేళలో విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే మే 23 తర్వాతి రోజున ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఒకవేళ.. ఫలితాలు భిన్నంగా వచ్చిన వేళ.. ఈ సినిమా విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న మాట వినిపిస్తుండటం గమనార్హం.
Please Read Disclaimer