మోడీ తీరు ఫై మోహన్ బాబు ఆగ్రహం..

0ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఫై ప్రధాని మోడీ తీరును అందరూ తప్పు పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ఎంపీ లు తమ రాజీనామాలు తెలుపుతుండగా , మరోపక్క సినిమా పరిశ్రమ నుండి సైతం మోడీ ఫై విమర్శలు వస్తున్నాయి. టాప్ డైరెక్టర్ కొరటాల తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలుపగా , తాజాగా మోహన్ బాబు సైతం తన అసంతృప్తి ని తెలియజేసాడు.

‘ఆంధ్రప్రదేశ్‌ పట్ల సవతి తల్లి తీరు ఎందుకు? ఏపీ ఏం తప్పు చేసింది? ప్రత్యేక హోదా గురించి ఏం జరుగుతోంది? ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని తెలంగాణ కూడా మద్దతు తెలుపుతోంది. ఇది ఏపీ సెంటిమెంట్‌ మాత్రమే అని అనుకుంటున్నారా?’ అని మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు.