నిజామా.. మోహన్ బాబు ఒక్క పైసా తీసుకోలేదా…?

0తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం ‘మహానటి’. అలనాటి తార సావిత్రి జీవిత కథ తో తెరకెక్కడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ లో సావిత్రి రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుండగా , ఎస్వీర్ రోల్ లో మోహన్ బాబు నటిస్తున్నారు. ‘మాయా బజార్’ లో ఎస్వీఆర్ పాడిన ‘వివాహభోజనంబు’ పాటను ఈ సినిమాలో చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇక నిన్నటి వరకు ఈ మూవీ లో మోహన్ బాబు నటించినందుకు ఆయనకు రెండు రోజులగాను 75 లక్షల పారితోషకం ఇచ్చినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.

ఈ సినిమాలో నటించినందుకు మోహన్ బాబు ఒక్క పైసా కూడా రెమ్యున్ రేషన్ తీసుకోనని అశ్వినీదత్ కు తేల్చి చెప్పేశారని ఫిలిం సర్కిల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎస్వీఆర్ పాత్రలో నటించిన మోహన్ బాబు అడిగినంత పారితోషకం ఇస్తానని అశ్వినీదత్ చెప్పారట. దాదాపు రూ. కోటి ఇచ్చేందుకు అశ్వినీదత్ సిద్ధపడ్డారట. అయితే మోహన్ బాబు మాత్రం సున్నితంగా తిరస్కరించారట. మహానటుడు ఎస్వీఆర్ పాత్రలో నటించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని దానికి వెల కట్టలేనని ఆయన చెప్పారట. సో మోహన్ బాబు 75 లక్షల తీసుకున్నారనే వార్తలో ఏ మాత్రం నిజం లేదు.