అత్తతో అల్లుడి అక్రమసంబంధం.. వ్యవహారం భార్యకు తెలిసి..

0mom-has-affair-with-daughteమనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోతోందన్న విషయం నిజమేనని ఓ సంఘటన రుజువు చేసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన.. స్థానికులను, పోలీసులను నివ్వెరపరిచింది. కూతురి భర్తతోనే ఓ తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ వ్యవహారం బటయపడటంతో అల్లుడిని చంపేందుకు ప్రయత్నించింది. కేథలీన్ రెజీనా డేవీస్ అనే 58 ఏళ్ల మహిళ.. తన అల్లుడు 33 ఏళ్ల మైఖెల్ స్కిర్రాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండానే వీళ్ల వ్యవహారం నడిచింది. అయితే అనుకోని పరిస్థితుల్లో తమ వ్యవహారం గురించి మైఖెల్ తన భార్య హన్నా స్కిర్రాకు తెలియజేశాడు. తమ మధ్య బంధం గురించి మైఖెల్ బయటపెడతాడని ఊహించని డేవీస్‌కు ఆగ్రహం తన్నుకొచ్చింది. కుమార్తె తనతో ఇక ప్రేమగా ఉండదన్న భావనతో.. సెప్టెంబర్ 20న అల్లుడి ఇంటిపై కోడిగుడ్ల దాడి చేసింది. కారు అద్దాలను పగలగొట్టింది.దీంతో భయపడిపోయిన అతడు.. ఇంటినుంచి బయటకు వచ్చాడు. అదే అదనుగా భావించిన ఆమె.. అక్కడ ఉన్న కారును తీసుకుని అతడిపైకి ఎక్కించాలనుకుంది. భయపడిపోయిన మైఖెల్ రోడ్డుమీద పరుగులు పెట్టాడు. రోడ్డుకు అటూ ఇటూ దిశలు మారుస్తూ తనను తాను తప్పించుకుంటూ పరుగెత్తాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పేట్రోలింగ్ సిబ్బంది అతడిని చూశారు. కారును ఆపి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. తనను భర్త మోసం చేశాడని, విడాకులు ఇప్పించమని కోరుతూ హన్నా కేసు పెట్టింది. మొత్తానికి అత్తా అల్లుడి అక్రమసంబంధం.. ఓ కుటుంబాన్ని నడివీధిలో నిలబెట్టింది.