హీరోయిన్ కార్ ఫై మూత్రం..

0సుడిగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మోనల్ గజ్జర్..ఆ తర్వాత ‘వెన్నెల వన్ బై టూ’, ‘బ్రదరాఫ్ బొమ్మాళి’ వంటి సినిమాలు చేసి బాగా దగ్గరయింది. తాజాగా ఈమె తన కార్ ఫై ఓ వ్యక్తి మూత్రం పోసాడని పోలీసులకు పిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మోనల్ తన స్నేహితురాలితోపాటు అంబావాడీ ప్రాంతంలోని ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. మాల్ ఎదుట కారును నిలిపివుంచింది. షాపింగ్ పూర్తయిన తరువాత బయటకు వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆమె కారు టైరుపై మూత్రం పోస్తుండటాన్ని గమనించి, అతడిని వారించింది. అయినా ఆ వ్యక్తి మోనల్ మాట వినకుండా మూత్రం పోసేసాడు. దీంతో మోనాల్ , పోలీసులకు పిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టడం మొదలు పెట్టారు.