బతికే ఉన్నా.. : హీరోయిన్ ప్రకటన..

0



బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సుడిగాడు లాంటి చిత్రాల్లో హీరో అల్లరి నరేష్ తో ఆడిపాడిన అందాల భామ మోనాల్ గుజ్జర్ పెను ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మోనాల్ తన స్నేహితుడు డాక్టర్ రోహిత్ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబసభ్యులు స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్ పూర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా తుక్కుతుక్కు అయ్యింది.

కారు పరిస్థితి చూస్తే అందులో ఎవరూ బతికి బట్టలేదని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మోనాల్ కూడా మృతిచెందినట్టు వార్తలు వచ్చాయి. దీంతో బుధవారం మోనాల్ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలను ఖండించారు. తనతో పాటు కుటుంబసభ్యులు స్నేహితులు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు. తన మెడ బెణకడంతో నొప్పి ఉందని.. అందుకే బెల్ట్ ధరించానని తెలిపారు.

మోనాల్ చివరగా గుజరాతీ చిత్రం ‘రేవా’లో నటించారు. ప్రస్తుతం ఆమె గుజరాతీ చిత్రం ‘ఫ్యామిలీ సర్కస్ ’ లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు గుజరాతీ హిందీ తమిళ్ మలయాళ చిత్రాల్లో మోనాల్ నటించారు.