బిగ్ బాస్ లో మరో ఘాటైన అందం

0ntr-in-Bigg-Bossఇప్పుడు సినిమాలు నటించే వారు ఎంత ఫేమస్ అవుతున్నారో టివి షో లో వస్తున్నవారు కూడా అంతే ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు ఇప్పుడే తెలుగు ప్రేక్షకులుకు పరిచయమైన బిగ్ బాస్ రియాలిటీ టివి షో పాపులర్ అయ్యింది అంటే మాత్రం అది యంగ్ హీరో ఎన్టీఆర్ వలనే అనే చెప్పాలి. ప్రేక్షకులలో తనకున్న క్రేజ్ వలన ఎన్టీఆర్ యాంకరింగ్ వలన మరింత విజయవంతం అయ్యింది ఈ షో. షో అయితే బాగానే నడుస్తున్న టిఆర్ పి రేటింగ్ కూడా అనుకున్న దానికన్న ఎక్కువే వస్తున్న చూసే వాళ్ళుకి ఎక్కడో చిన్న అసంతృప్తి ఉందని తెలుస్తుంది.

స్టార్ మా టివి వాళ్ళు ఈ షో ఇంత సక్సెస్ అయినందుకు సంబరాలు జరుపుకుంటున్నారు. మన ప్రేక్షకులకు నవ్వినా అందంగా ఉండాలి ఏడ్చినా అందంగా ఉండాలి అనుకుంటున్నారు కాబోలు షో లో అందం తక్కువ అయ్యింది అని కంప్లైన్ చేస్తున్నారు. కొంతమంది మెయిల్స్ ట్వీట్స్ కూడా చేస్తున్నారు కొంచం అందాన్ని యాడ్ చేయండంటూ. షో అయితే ఓకే కానీ అందులో ఉన్న మొఖాలనే చూడలేకపోతున్నాము కొంచెం అందాన్ని జతచేయండి అని వేడుకుంటున్నారు. కొద్ది రోజులు కిందట తెలుగు నటి దీక్షా పంత్ ని వైల్డ్ కార్డ్ వాడి బిగ్ బాస్ హౌస్ లోకి తెచ్చింది కూడా కేవలం గ్లామర్ కోసమే. ఈమె అందం వరకు సరిపోయినా ఆమె పెద్ద స్టార్ ఏమి కాదు పైగా మన ప్రేక్షకులలో అంతా క్రేజ్ కూడా లేదు. దానితో చానల్ వాళ్ళు మళ్ళీ ఘాటైన కొత్త అందాన్ని వెతికే పనిలో పడ్డారు. ఈ సారి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేది ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ అని చెబుతున్నారు. కొన్ని వారాలు తరువాత వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె రావచ్చు అని తెలుస్తుంది.

ఏదైనా అందానికి కనెక్ట్ అయినంత తొందరగా మరి దేనికి కనెక్ట్ కాలేరు ప్రేక్షకులు. అందంగా ఉన్నవాళ్ళు ఏమి చేసిన అది తొందరగా రక్తికడుతుంది. అందుకే సినిమా టివి పరిశ్రమ అంతా అందం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.