సుస్మితకి మదర్‌ థెరీసా అవార్డ్‌

0sushmita_sen-mother-theresa-awardబాలీవుడ్‌ భామ, మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌కి మదర్‌ థెరీసా పురస్కారం దక్కింది. నటిగా కీర్తి ప్రతిష్టలందుకున్న సుస్మితాసేన్‌, సామాజిక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకున్న సుస్మిత, ఛారిటబుల్‌ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంది.

సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తన బాధ్యతగా చెప్పుకుంటుంది సుస్మితాసేన్‌. ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా, ‘ద హార్మనీ ఫౌండేషన్‌’ అనే సంస్థ మదర్‌ థెరీసా అవార్డుతో సుస్మితాసేన్‌ని గౌరవించింది.

నిన్ననే ఈ అవార్డును అందుకున్న సుస్మితాసేన్‌, మదర్‌ థెరీసా పేరుతో నెలకొల్పిన అవార్డును అందుకున్నందుకు చాలా ఆనందంగా వుందంటూ తన అభిమానులకు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. పేరు కోసం తాను సేవా కార్యక్రమాలు చేయడంలేదనీ, సమాజంలో తానూ ఓ మనిషిగా సాటి మనిషికి సహాయం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాననీ, మదర్‌ థెరీసా పురస్కారం వచ్చాక, తన బాధ్యత మరింత పెరిగిందని సుస్మితాసేన్‌ వ్యాఖ్యానించింది.

Tags : సుస్మితకి మదర్‌ థెరీసా అవార్డ్‌, Bollywood, Susmitha Sen, Mother Theresa, Mother Theresa Award to Susmitha Sen