బక్కగా అయ్యిందని నాగిణికి క్లాసిచ్చారు

0ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సినీ తారలు ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికి తెలిసిందే. ముఖ్యంగా నటీమణులు అయితే ఫిట్ నెస్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. కాస్త తేడా వచ్చినా కూడా మళ్లీ మార్పులు చేయాలంటే చాలా కష్టం. అందుకే వీలైనంత వరకు ఎంత కష్టమైనా సరే డైట్ ని ఫాలో అవుతుంటారు. అయితే రీసెంట్ గా ఓ గ్లామర్ బ్యూటీ మాత్రం ఆ ఫిట్ నెస్ లో తడబడింది అనే టాక్ వస్తోంది.

అంతే కాకుండా ఏమైనా ఊహించనిది ఏమైనా జరిగిందా? ఆమె హెల్త్ లో తేడా వచ్చిందా? అనే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ బుల్లి తెరపై సీరియల్స్ తో అలరించిన మౌని రాయ్. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. నాగిణి సీరియల్ కూడా నటించింది ఈ బ్యూటీనే. ఇకపోతే అమ్మడు రీసెంట్ పోస్ట్ చేసిన కొన్ని ఐహేట్ పోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సడన్ గా బక్కగా అవ్వడంతో వివిధరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ట్రాల్స్ కూడా బాగానే వస్తున్నాయి. కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకో అంటూ కౌంటర్ ఇవ్వడం వైరల్ అవుతోంది. అయితే అందరూ అనుమానించినట్టుగా మౌని రాయ్ కు ఏమి కాలేదు. ఆమె కొంచెం సన్నబడిన మాట వాస్తవమే కానీ ఓ వైపు నుంచి ఫోటోలు తీయడం వల్ల మరి బక్కగా కనిపించింది. అది సంగతి