నేలపై కూర్చుని బాహుబలి2 చూసిన కవిత!

0Kavitha-and-baahubali-2నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తాను అన్న మాట నిలబెట్టుకున్నారు. ఆదివారం రాత్రి గురుకుల పాఠశాల ఆవరణలో నేల‌పై కూర్చొని గ్రామస్తులతోపాటు బాహుబ‌లి-2 సినిమా చూశారు ఎంపీ కవిత. ఇటీవ‌లే ఆమె నిజామాబాద్ జిల్లా పోతంగల్‌ గ్రామస్తుల‌కు ఈ మాట ఇచ్చారు.

బ‌తుక‌మ్మ ఆడి అనంత‌రం గ్రామ‌స్తుల‌తో క‌లిసి ఓ సినిమా చూస్తాన‌ని చెప్పారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఎంపీ కవిత బ‌తుక‌మ్మ ఆడిన త‌రువాత త‌న‌ భర్త అనిల్‌, కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి అక్క‌డి గురుకుల పాఠ‌శాల వ‌ద్ద ఈ సినిమా చూశారు.

శుక్రవారం ఉదయం పొతంగల్‌లో అడుగుపెట్టిన ఎంపీకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం తన మెట్టినిల్లు నవీపేట మండలం పొతంగల్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల అభిమానం చూరగొన్న బహుబలి సినిమాను పొతంగల్ గ్రామస్తులతో కలిసి ఎంపీ వీక్షించారు.

హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఎక్విప్‌మెంట్‌తో స్థానిక స్కూల్‌లో పెద్ద తెరపై బాహుబలి-2 సినిమాను ప్రదర్శించారు. కుటుంబసభ్యులు, గ్రామ‌స్తుల‌తో క‌లిసి ఆమె నేలపై కూర్చుని ఈ సినిమాను చూడ‌డం విశేషం. ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న కోసం ఎంపీ క‌విత‌ ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. కాగా, గత మూడు రోజుల నుంచి ఎంపీ కవిత ఆ గ్రామంలోనే ఉంటున్నారు.