అంబానీ ఇంట మరో శుభకార్యం..

0దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ తన సంస్థకు సంబంధించిన వ్యాపారపరమైన అంశాల కంటే…ఇటీవల తన కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభకార్యాలతో ఎక్కువగా తెరమీదకు వస్తున్నారు! అంబానీ ఇంట కొద్దికాలం క్రితం వరుస సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. అంబానీ కుమారుడు ఆకాశ్ కుమార్తె ఇషాలకు పెళ్లి సంబంధాలు సెట్ అయ్యాయి. ఇటీవల పార్టీలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు మరో సందడికి అంబానీ కుటుంబం రెడీ అవుతోంది. అదే ముఖేష్ చిన్నకొడుకు అనంత్ అంబానీ వివాహం. ముఖేష్ చిన్న తనయుడు కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

గత నెలలో ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ పిరామల్ ఎంటర్ప్రైజెస్ అధినేత అజయ్ పిరామల్ తనయుడు ఆనంద్ పిరమాల్ను వివాహం చేసుకోబోతున్న వార్త వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇషా ఆనంద్లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆనంద్ పిరామల్ ఇషాలు మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. మహారాష్ట్ర మహాబలేశ్వర్ లోని ఒక ఆలయంలో ఇషాకు…ఆనంద్ ప్రపోజ్ చేయగా అప్పుడే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇషా అంగీకరించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అంతకుముందు ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల వివాహం కుదిరింది. ఆకాశ్తో పాటే ఇషా వివాహం డిసెంబరులో జరగనుందని పలువురు అంచనాలు వేశారు.

అయితే తన సోదరుడు మరియు సోదరి వివాహ సందడిలోనే అనంత్ కూడా తన పెళ్లి ముచ్చటను పంచుకున్నాడు. రాధిక మర్చంట్ అనే యువతిని అనంత్ వివాహం చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టు ఆ ఫొటోలు చూస్తుంటే స్పష్టం అవుతుంది. హలో మ్యాగజైన్కు వీరిద్దరూ కలిసి ఇచ్చిన ఫొటోలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు . వీళ్లద్దరూ చిన్ననాటి స్నేహితులు. రాధిక మర్చంట్ ఫ్యామిలీ పెద్ద వ్యాపార కుటుంబంగా ప్రచారం జరుగుతుంది. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని.. రెండు కుటుంబాలు త్వరలో పెళ్లికి అంగీకారం తెలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అనంత్ అంబానీ గాళ్ ఫ్రెండ్ గా.. రాధిక మర్చంట్ సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయిపోయింది. ఈ విషయంపై అంబానీ కుటుంబం మాత్రం అధికారికంగా స్పందించాల్సి ఉంద