అంబానీ తనయుడి పెళ్లి.. ఎవరితో తెలుసా ?

0రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ వివాహం ఈ ఏడాది చివర్లో జరగబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వజ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్‌ అధిపతి రసెల్‌ మెహతా చిన్న కుమార్తె శ్లోక మెహతాను ఆయన మనువాడబోతున్నారని తెలిసింది. త్వరలోనే నిశ్చితార్థం తేదీని ప్రకటించి, డిసెంబరు ప్రారంభంలో పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తారని తెలిసింది.

శ్లోక 2009లో ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో డిగ్రీ, ది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ నుంచి న్యాయ విద్యలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. జులై 2014 నుంచి రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్‌, శ్లోక ఒకరినొకరు ఇష్టపడేవారని, ఇంటర్ పూర్తి కాగానే ఆకాశ్‌ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడని చెబుతున్నారు.