పేదరికం తో… ముమైత్ గతజీవితం ఇదీ

0mumaith-khan-family-personaముమైత్ ఖాన్ పేరు వింటే….. టాలీవుడ్లో హాట్ హాట్ ఐటం సాంగులే గుర్తుకొస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ఐటం సాంగుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటోంది. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఎక్కడా లేనంతగా ఆమె మీడియాలో కనిపించింది.

బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ కంటే డ్రగ్స్ కేసులో ముమైత్ పాత్ర మీదనే ఎక్కువ దృష్టి ఉంది. అసలు ఇంత గా పాపులర్ అయిపోయిన ముమైత్ అసలు నటి కాకముందు జీవితం ఏమిటి? అసలు ముమైత్ అంత కటినంగా, ప్రపంచాన్ని లెక్క చేయనంత మొండి గా ఎలా మారిందీ? ఇప్పుడు డ్రగ్స్ కేసులోనూ ఆమె పేరు వినిపించటానికి కారణం అయిన ఆ మత్తు కు బానిస కావటానికి ఆమె జీవితం లో ఉన్న ఫ్రస్ట్రేషనే కారణమా?? ఒక్క సారి ఆమె జీవితాన్ని చూస్తే….

ముమైత్ తల్లి పాకిస్థానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ తాత పాక్ నుంచి ముంబై ప్రాంతానికి వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ఆపై కూతురు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్.

పిల్లల పెంపకం భారం కాగా, తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు రూ. 1500 జీతానికి ఓ డ్యాన్స్ ట్రూప్ లో చేరింది. అక్కడే ఆమె తన ప్రతిభ బయటపడింది.సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేసింది. ముమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే.

ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది కూడా. పూరీ జగన్నాథ్ తీసిన ‘పోకిరి’ చిత్రంలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనే ఐటమ్ సాంగ్ ముమైత్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయగా, ఆపై ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. సుమారు 40 వరకూ హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి.

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో బాగా పాపులర్ అయిన ఐటం గర్ల్స్ ఎవరు అంటే అందులో తప్పకుండా వినిపించే పేరు ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలో ఐటం సాంగ్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లిన ముమైత్ ఖాన్ తర్వాత సౌత్ లో బాగా పాపులర్ అయింది.

అయితే ముమైత్ ఖాన్ ఒకప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడిందట. చిన్నతనం లో పూటగడవటం కూడా కష్టమైనప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తే బావుండు ఏదైనా తెస్తారు కదా అని దేవున్ని ప్రార్థించేదట.. ముమైత్‌ఖాన్ ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 40 వరకూ హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి.

ఇప్పుడు సినీ నటిగా, సెలబ్రిటీగా, ఐట‌మ్‌గ‌ర్ల్ అంటె ప్రేక్ష‌కుల‌కు ముందుగా గుర్తుకొచ్చేది ముమైత్ ఖాన్.ఐట‌మ్ సాంగ్స్‌లో న‌టించిందంటె ధియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల నీరాజ‌నాలె.కాని ఇప్పుడు సినిమాలులేక అల్లాడుతున్న ముమైత్‌కు డ్ర‌గ్స్‌కేసు మ‌రిన్ని చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది.