బిగ్ బాస్ టుడే‌: తడిసిన అందాలతో ముమైత్ రచ్చ

0Bigg-Boss-Episode-6-In-Teluటెలివిజన్ చరిత్రలో తొలిసారిగా భారీ హంగామాతో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో 6 ఎపిసోడ్ రంజుగా సాగింది. ఇక ఈ రోజు హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్‌లో తెలుగు మాత్రమే మాట్లాడాలన్న నిబంధనను అతిక్రమించిన వారికి శిక్షలు వేసేందుకు బాధ్యతలు తీసుకున్న ముమైత్ ప్రిన్స్‌, మహేష్ కత్తిలకు శిక్ష విధించింది. ఇంట్లో వాళ్లు గుర్తుకు వస్తున్నారని సింగర్ మధుప్రియ మళ్లీ ఏడ్చేయడం.. కల్పన సర్దిచెప్పడం జరిగిపోయింది. తనకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళిపోదామని ఉందని తాను ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పని చేయనని ఇక్కడ ఎవరి పనులు వారు చేసుకోవడం.. ఎవరో చేసిన వాటిని తాను తినాలంటే చాలా ఇబ్బందిగా ఉందని తొందరగా ఇంటికి వెళిపోదామని ఉందని మధుప్రియ బిగ్ బాస్ హౌస్‌నుండి ఎప్పుడు బయటపడదామని ఉందంటూ కత్తి కార్తీక, ప్రిన్స్, ఆదర్శ్‌ల ముందు భోరుమంది.

మరోవైపు ఇంటినియమాలు పాటించని కుటుంబ సభ్యులకు శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయని బిగ్ బాస్ మరోసారి హెచ్చరించారు. స్మోక్ జోన్‌లో మరోసారి నిబంధనలు ఉల్లంఘించారని బిగ్ బాస్ హెచ్చరించారు . మరోవైపు జ్యోతి తనకు తెలుగు సరిగా నేర్పడం లేదని టీజర్‌ను మర్చేయమని.. మహేష్ కత్తి టీజర్‌గా కావాలంటూ బిగ్ బాస్‌‌ని రిక్వెస్ట్ చేసింది హరిప్రియ.

కుటుంబ సభ్యులు అందరూ కలిసి కెప్టెన్‌ను ఎన్నుకొనే అవకాశాన్ని అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. ఇందుకోసం ఇంటి నియమానలు సక్రమంగా నిర్వహిస్తున్న మహిళా సభ్యులు మాత్రమే అర్హులని అందుకోసం ఇద్దరు మధ్య స్విమ్మింగ్ ఫూల్ టాస్క్‌ని నిర్వహించాల్సిందిగా ప్రిన్స్‌ ఆదేసించారు బిగ్ బాస్. ఇక స్విమ్మింగ్ ఫూల్ టాస్క్‌లో ముమైత్ ఖాన్, కల్పన పోటీ పడగా ఈ టాస్క్‌లో ఒక్క పాయింట్ తేడాతో కల్పన గెలిచి బిగ్ బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఎన్నికైంది. ఇక టాస్క్ సంగతి పక్కన పెడితే స్విమ్మింగ్ ఫూల్‌లో తడిసిన భారీ అందాల ఆరబోస్తూ.. అడిగిన వారికళ్లా హగ్‌లు ఇస్తూ.. రెచ్చిపోయి అందాలను ప్రదర్శించింది.

ఇక బిగ్ బాస్ హౌస్‌లోని కుటుంబ సభ్యులకు ఇచ్చిన టాస్క్‌ని సక్రమంగా నిర్వర్తించినా.. బిగ్ బాస్ షోని సక్రమంగా నడిపించడంలేదని బిగ్ బాస్ తన పరువుని దిగజార్చుకుంటున్నాడని శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు . షో స్టార్ట్ అయ్యి ఐదురోజులైనా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని సెన్స్ లేకుండా షో నడిపిస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు శివ బాలాజీ. ఇక ధనరాజ్ కూడా తాము చేసిన తప్పేంటో అన్నీ సక్రమంగానే చేస్తున్నాము అంటూ బిగ్ బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్‌ను ఏమడిగినా తమకు ఇవ్వడం లేదని సిగరెట్‌లు కూడా పంపించలేదని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు నిబంధనలపై పూర్తిగా విభేదించారు. ఈ ప్రాసెస్‌లో 14 మంది కుటుంబ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు.

బిగ్ బాస్ హౌస్‌లో స్మోకింగ్ చేసే ఐదుగురులో ఏ ఒక్కరు స్మోకింగ్ చేసినా.. మిగిలిన వారందరూ బాత్ రూంలో వెళ్లాలని శిక్ష విధించారు బిగ్ బాస్. దీన్ని అంగీకరించిన కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు స్మోకింగ్ చేసినా మిగతా వాళ్లు బాత్ రూంకి వెళ్లడం తమకి నచ్చలేదని.. ఐదుగురి కోసం 13 మందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చేసిన తప్పుకు క్షమించాలని వదిలేయాలని బిగ్ బాస్‌ను వేడుకున్నారు స్మోకింగ్ బ్యాచ్ ముమైత్, ధనరాజ్, సమీర్,సంపూర్ణేష్ బాబు, శివబాలాజీలు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ రౌండ్‌కి డేంజర్ బెల్స్ మోగించారు బిగ్ బాస్.